Masa Shivaratri 2026 Dates | Masik Shivaratri | మాస శివరాత్రి ఎందుకు, ఎలా జరుపుకోవాలి?

4
38789
Masa Shivarathri in Telugu
What are the Dates of Masa Shivarathi 2026 in Telugu / Masik Shivaratri?

Masik Shivratri 2026

1మాస శివరాత్రి 2026

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp. com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి? (How to do Masa Shivratri Puja?)

ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.

అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి? (Why is Masik Shivratri celebrated?)

మహాశివుడు లయ కారకుడు.  కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు  కేతువు, అమావాస్య  ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

చంద్రోమా మనస్సో జాతః

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో  తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.

అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించదానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ? (How to Celebrate Masik Shivrat?)

ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5/11/18/21/56/108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు? (Know Masik Shivaratri Benefits):

  • ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
  • సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
  • వృత్తి అంశంలో ఉన్న ఆలశ్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కల్గుతుంది.
  • దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి  ఉపశమనం లభిస్తుంది.
  • ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఘంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖశ్చ్హితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
  • మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందుదాం.

మూలం : నిర్ణయ సింధువు ,కనీనికా నాడీ గ్రంధము. కర్మవిపాకము

రాఘవేంద్ర
ప్రముఖ నాడీ జ్యోతిష, వాస్తు పండితులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం- 5

2026 Masik Shivaratri Dates

తేది వేడుక పేరు ప్రారంభ సమయం ముగింపు సమయం
16-01-2026 (శుక్రవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:57 రాత్రి 12:47 (17 జన)
15-02-2026 (ఆదివారం) మహా శివరాత్రి / మాసిక శివరాత్రి రాత్రి 12:02 రాత్రి 12:51 (16 ఫిబ్ర)
17-03-2026 (మంగళవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:57 రాత్రి 12:44 (18 మార్చి)
15-04-2026 (బుధవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:49 రాత్రి 12:35 (16 ఏప్రిల్)
15-05-2026 (శుక్రవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:46 రాత్రి 12:31 (16 మే)
13-06-2026 (శనివారం) అధిక మాసిక శివరాత్రి రాత్రి 11:50 రాత్రి 12:35 (14 జూన్)
12-07-2026 (ఆదివారం) మాసిక శివరాత్రి రాత్రి 11:56 రాత్రి 12:40 (13 జూలై)
11-08-2026 (మంగళవారం) శ్రావణ (సావన్) శివరాత్రి / మాసిక శివరాత్రి రాత్రి 11:55 రాత్రి 12:40 (12 ఆగస్టు)
09-09-2026 (బుధవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:46 రాత్రి 12:33 (10 సెప్టెంబర్)
08-10-2026 (గురువారం) మాసిక శివరాత్రి రాత్రి 11:36 రాత్రి 12:24 (09 అక్టోబర్)
07-11-2026 (శనివారం) మాసిక శివరాత్రి రాత్రి 11:31 రాత్రి 12:21 (08 నవంబర్)
07-12-2026 (సోమవారం) మాసిక శివరాత్రి రాత్రి 11:39 రాత్రి 12:29 (08 డిసెంబర్)

 

Back

4 COMMENTS

  1. చాలా బాగా,వివరంగా మాస శివరాత్రి గురించి
    తెలియచేసారు..కృతజ్నతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here