
What are the Results of Eating While Sitting in Bed?
2భోజనం చేసేటప్పుడు పాఠించవలసిన నియమాలు (Rules to Recite While Eating)
చాలా మంది చిన్న పిల్లలు మంచం పైన కుర్చొపేట్టి అన్నం తినిపిస్తుంటారు. పెద్దలు కూడా చాలా మంది మంచం పైన కూర్చుని అన్నం తింటుంటారు. ఆలా చేయడం వలన మనం తిన్న అన్నం మంచం కోళ్ళకు పడుతుందని మన ఇంట్లో పెద్దవాళ్లు చెపుతుంటారు. దాని అర్థం మనం తిన్న అన్నం మన ఒంటికి పట్టదు అని అర్థం.
భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని తినమని చెబుతుంటారు. ఆలా చెప్పడం వెనుక సైంటిఫిక్ కారణంతో పాటు ఆధ్యాత్మిక కారణం కూడా ఉందని మన పండితులు చెబుతున్నారు. ఇలా మంచం పైన కూర్చుని భోజనం చేయడం వల్ల మన ఆహారం తీసుకొని భంగిమ సరిగా ఉండదు అందువలన మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు అంటున్నారు. చక్కగా నేలపైన పద్మాసనం వేసుకుని కూర్చుని భోజనం చేయడం మంచిది. మనం భోజనం నేలపై కూర్చుని చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది.
మంచం పైన కూర్చుని తినడం వలన ఆహారం సరిగా జీర్ణం కాక అది రోగాలకు దారి తీస్తుంది. ఆరోగ్య సమస్యలతో పాటు భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయట. కుటుంబంలో మనశ్శాంతి ఉండదంట. అందుకే మనం భోజనం చేసే ముందు ఆ భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం అని, మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. అందువలన దేహానికి శాంతి చేకూరడానికి భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మనం భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని ఐదు వేళ్ళతో తాకినప్పుడు జీవశక్తి ఉత్తేజ పడుతుంది అందుకే చేత్తోనే ఆహారాన్ని తినాలి. ఆహారం తినే ముందు ఆ భగవంతున్ని ప్రార్దించాలి. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి. మంచం మీద మాత్రం కూర్చుని తినకూడదు. ఆలా చేస్తే ఇబ్బందులకు గురవుతారు. మనం అన్నం తినేటప్పుడు గోవుకు పెడితే పుణ్యం వస్తుంది. తినేటప్పుడు మొదటి ముద్ద గోవుకు పెట్టడం మంచిది అని మన పండితులు చెబుతున్నారు.
Related Posts
https://hariome.com/vastu-tips-for-financial-difficulties-disputes-in-family-with-betel-leaves/
https://hariome.com/vastu-tips-wealth-prosperity-with-aparajita-flowers/
సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House
ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!| Chanakya Neeti
ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/