వృశ్చికం

విశాఖ 4వ పాదం, అనూరాధ, 1,2,3,4 పాదాలు, జ్యేష్ట 1,2,3,4 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

శారీరక శ్రమలు తగ్గినప్పటికిన్నీ సుఖసౌఖ్యములు కొరవడగలదు. కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగించు అవకాశములు కలవు. వృత్తి, వ్యాపారాదుల యందు చక్కని ప్రతిభాపాటవాలను ప్రదర్శించేదరు. కాని తమ కింద పనిచేయు వారు నుండి యిబ్బందులను ఎదుర్కొనవలసి రాగలదు. కపటవేష దారి వలే నడుచుకొందురు. మిత్రులు సహాయం అందిచినట్టే అందించి తప్పుద్రోవ పట్టించెదరు. మేనత్త లేదా మేనమామల మూలక సమస్యలు ఉండగలవు.

ధనూరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయు శుభా శుభ మిశ్రమ ఫలము కలుగును. ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుటచే మిశ్రమఫలితములతో ఊరటగా నుండును. సర్వకార్య విఘ్నములతో సతమతమగుదురు, ఆరోగ్యము మందగించును, ఆర్థిక సమస్యలు ఎక్కువగును, దుర్వ్యయము పెరుగును, మనోబలము తగ్గును, బంధు మిత్రాదులతో కలహ వాతావరణముండును అకాల భోజనము, జ్వరభయము, చోరభయము, అగ్నిభయము, రాజభయము, ఋణపీడ కలుగును, ప్రయాణ విఘ్నములుండును.

సంవత్సర ప్రారంభమున కొంత ఊరటగానుండును.మనోచింత తీరును, ఆలస్యము మీద కొన్ని పనులు నెరవేరును, శతృ విజయము కలుగును, ప్రయాణముల యందు కొన్ని పనులు నెరవేరును, శుభకార్యములు ఆలస్యముగా నెరవేరును. మందగమనముగా కొనసాగును. సంఘగౌరవము పెరుగును, మాటకు విలువ పెరుగును. బంధుమిత్రాదులు సహకరించగలరు. ఆరోగ్యము కొంత సిద్దించును. ఇంటి యందు వివాహది శుభకార్యముల యందు పురోగతి లభించును.

సంవత్సర మధ్య కాలమందు ప్రతి పని యందు వ్యతిరేకత, జ్వరపీడ, అనారోగ్యము కలుగును, శతృపీడ, ఋణపీడ కలుగును, పోలిసు కోర్టు కేసులయందు వ్యతిరేకత పవనములు వీచును, మనశ్శాంతి కరువగును, మనోచింత పెరుగును, అతి నిద్ర, అతి ఆకలి, అకాల

భోజనము, అరుచి కలుగును, బంధుమిత్రాదులతో కలహము కలుగును, వివాహది శుభ కార్యములు నిలిచిపోవును, భూ గృహ నిర్మాణాది కార్యములు వాయిదా పడును, ధన నష్టము కలుగును, మానసిక శక్తి క్షీణించును. సంవత్సరాంతమున మరికొంత ఊరట లభించగలదు, ఆరోగ్యము కలుగును,

ధన లాభము కలుగును, కొన్ని కార్యములు కష్టము మీద నెరవేరును, కృషి వాణిజ్య లాభము కలుగును, మనో ధైర్యము కలుగును, ఋణపీడ, శతృపీడ శాంతించును.

విద్యార్థులకు కష్టకాలము అతి కష్టము మీద విజయము సాధించగలరు, ఉద్యోగులకు నిరాశ కలుగును, సస్పెన్సన్లు ఎదుర్కొనక తప్పదు, దూరప్రాంత అయిష్ట బదిలీలు జరుగును, నిరద్యోగులకు నిరాశ పెరుగును, అవివాహితులకు శూభశుభ మిశ్రమ ఫలము కలుగును. రైతులకు పంట నష్టములు, చీడపీడల వలన నష్టములు ఎదుర్కోవలసి వచ్చును, స్పెక్యులేషను | అనుకూలము కాదు, NRI లకు కష్ట కాలము స్వదేశీ బాట పట్టక తప్పదు.