మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు, రేవతి 1,2,3,4 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

31 May, 2020 to 06 Jun, 2020

వారం ప్రారంభంలో మాట పదును మరింత పెరిగి అన్నింటా ముందడుగులో వుండగలరు. చురుకుతనం, దురుసుతనం రెండునూ ప్రదర్శించేదరు. వారం మధ్య నుండి మనోల్లాసం కొరకు మరియు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై ధనం ఖర్చుచేయు అవకాశములు కలవు. వారం ఆఖరులో అత్తావారి కుటుంబం లేదా తమ యొక్క కనిష్ఠ సోదరీలతో (స్త్రీ లతో ) మాటతేడాలు ఏర్పడు అవకాశములు కలవు. తండ్రి లేదా తల్లి తరపు బంధవుల సహకారం లభించగలదు.

June

మాస ప్రారంభంలో సమయానికి స్పందించలేకపోవుట వలన వృత్తి, వ్యాపారాదులలో చికాకులుగా ఉండగలదు. పెద్దల యొక్క సహాయం లభించుట సలహా సూచన ఇచ్చుటయే గాక తమ యొక్క తప్పిదములను వేలిత్తి చూపి సరిచేసి సరియైన మార్గంలో పయనించేవిధంగా చెప్పెదరు. మాస మధ్య నుండి వాహన, వసతి సౌఖర్యములు సమయానికి సమకూరగలవు. తమ కంటే చిన్నవారి వలన లేదా అత్తావారి మూలకంగా సమస్యలు ఏర్పడు అవకాశములు కలవు. తండ్రితో అనవసరమైన వాటి కొరకు వాదోపవాదాలు దిగుట మంచిది కాదు. ఆలోచన, ప్రవర్తన తీరులో మార్పులు సంభవించగలవు. ఏవ్యవహారం చేపట్టిన లాభనష్టాల భేరిజు వేసుకొని మరీ ముందుకు సాగెదరు. 16వ తేదీ మనోవేదనలతో సతమతం చెందెదరు. మాస ఆఖరులో సామాజిక వ్యవహారముల యందు పేరు, ప్రఖ్యాతలకు భంగం వాటిల్లు అవకాశములు కలవు లేదా జీవితభాగస్వామితో తర్కం సంభవించగలదు. వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన విషయములను ఇతరులతో ప్రస్తావించుట మంచిది కాదు.

మీనరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయు శుభాశుభ మిశ్రమ ఫలము కలుగును. నూతన కార్యములన్నియు విజయవంత మగును, కొత్త స్నేహితుల కలయికతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలరు, మనోబలము పెరుగును, బంధు మిత్ర సహకారం పూర్తిగా లభించును, నూతన పదవీయోగము కలుగును, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగును, శతృపీడ, ఋణపీడ సమసి పోవును. శతృవులు తోక | ముడిచెదరు. దైవభక్తి పెరుగును, పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. మనో బలము పెరుగును.

సంవత్సర మధ్యకాలమందు కొంత మిశ్రమ ఫలము కలుగును, అనారోగ్య సమస్యలు | భాధించును, రాజకీయ పదవీ వియోగము, ఉద్యోగనష్టము చేయు వృత్తి వ్యాపారాదులయందు వ్యతిరేకత కలుగును, వాహన ప్రమదాలను నెదుర్కొనవలసి వచ్చును, వాహన క్షయము కలుగును, వ్యాపారములు నష్టముల దిశగా పయనించును, గృహ మార్పులు వృత్తి మార్పులుండును. తరచు అనారొగ్యపీడ, చర్మరోగము, మిత్ర ద్వేషము, శతృపీడ, శిరో రోగము వైద్యశాల దర్శనము, ఔషద సేవనము కలుగును. స్పోటక ప్రణభాదలు కలుగును.

సంవత్సరాంతమున అత్యంత అనుకూల కాలముగా నుండగలదు. సర్వకార్యజయము, సర్వకార్యసిద్ధి, మనో నిశ్చింతయు పెరుగును, ధనధాన్య వృద్ధి, బందు మిత్ర లాభము, | పుణ్యక్షేత్ర సందర్శనము, యత్న కార్యసిద్ధి, ఇంటి యందు వివాహది శుభకార్యములు జరుగుట, | దైవ, బ్రాహ్మణపూజ, కృషిలాభము, క్షేత్రవృద్ధి, సత్కధాశ్రవణము కలుగును, రాజ గౌరవము,

సంతానప్రాప్తి, పుత్రోత్సవము, దేహరోగ్యము, విశేషసౌఖ్యము, కీర్తిలాభము, మనోత్సాహము, బందువుల అభివృద్ధి కలుగును. రాజ సన్మానము, నూతన రాజకీయ పదవీ లాభము, ఉద్యోగప్రాప్తి, కృషి వాణిజ్య వ్యాపార లాభము, నూతన రత్నాభరణ ప్రాప్తి, మణి సంగ్రహణము, | వాహన లాభము, గో లాభము, కలుగును. అపరిమిత ధనధాన్య వృద్ధి కలుగును.

విద్యార్థులకు రెండవఛాన్స్ లాభము విజయము సాధించగలరు, ర్యాంకులు | సాధించగలరు, ఉద్యోగులకు అనుకూల కాలము పై అధికారుల ఆశీస్సులుండును, అనుకూల బదిలీలు జరుగును, నిరుద్యోగులకు అనుకూలము ఉద్యోగము పొందగలరు, బ్రహ్మచారులకు విశేష సౌఖ్యము కోరిన సంబంధము కుదురును. రైతులకు రెండు పంటలు లాభము, నూతన క్షేత్రభి వృద్ధి కలుగును, వ్యాపారులు విశేషమైన ధనసంపాదన చేయగలరు, స్పెక్యులేషన్ | పూర్తిగా లాభించును, NRI లకు శుభము నూతన ప్రాజెక్టులు రూపొందించెదరు.