కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు, ఆశ్లేష 1,2,3,4 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారు అనే విధంగా ఉండగలదు పరస్థితులు. మాటలను ఆదుపు చేయుట కష్టతరం అగుట వలన ఆ మాటలనే ఆలుసుగా తీసుకొందురు. స్త్రీ సహాయ సహకారములు లభించగలవు. కుటుంబపరంగా కొంత అనుకూల సమయంగా ఉన్నప్పటికిన్నీ వైవాహిక సమస్యలు అధికం కాగలవు. మీరు ఒకటి చెబితే జీవితభాగస్వామి మరొకవిధంగా అర్ధం చేసుకొనుట వలన అపార్ధములకు దారితీయగలవు. అవగాహన లోపించగలదు.

కర్కాటకరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభా,శుభ మిశ్రమ ఫలము కలుగును, సంవత్సర ప్రారంభమున సకల కార్యజయము, మనో ధైర్యము కలిగి శతృజయము కలుగును. నూతన కార్యములన్నియూ సత్వరము నెరవేరును, సంవత్సర మద్య కాలమందు విపరీతమైన ధనవ్యయం కలుగును. అమర్యాద, హని, మనోచింత కలుగును. కార్యములన్నియు ఆగిపోవును, దుర్వ్యయము కలుగును, మనోధైర్యము తగ్గును. కలహ వాతవరణము పెరుగును. సంవత్సరాంతమున తిరిగి మనోధైర్యము పుంజుకొని సకల కార్యములు పూర్తి చేయుదురు, శతృనాశము కలిగి సర్వకార్యజయము కలుగును.

సంవత్సర ప్రారంభమున వివాహది కార్యములన్నియు సిద్ధించును, నూతన పథకములు విజయము చేకూర్చును, నూతన రాజకీయ పదవీయోగము కలుగును, రాజ పూజ్యత కలుగును, మనోధైర్యముతో సకల కార్యసిద్ధి, అధిక ధనలాభం కలుగును, భూ, గృహనిర్మాణాది కార్యములు సిద్ధించును, బంధు, మిత్ర సహకారము పూర్తిగా కలుగును. ఇంటి యందు అనుకూల వాతవరణము ఉండును, నూతన వాహన సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగును.

సంవత్సర మద్యకాలమందు సర్వకార్యములందు ఆధిక ధనవ్యమము, సర్వులతో కలహము కలుగును, బంధు మిత్రులు శతృవులగుదురు, చేయు కార్యములన్నియూ నిలిచి పోవును, వివాహది శుభకార్యములయందు వ్యతిరేకత వ్యక్తమగును. తరచు చర్మరోగములు, స్పోటక, ప్రణభాదలు కలుగును. పదవీ వియోగము కలుగును, సంఘగౌరము తగ్గును, తక్కువ వారి వలన మాటలు పడుట, నీచ జన సేవ, నీచ సాంగత్యము కలుగును.

సంవత్సరాంతమున భోగలాలసత కలుగును, మనోధైర్యము కలుగును, ఆరోగ్యము సిద్దించును, సకలకార్యసిద్ధి, సర్వ కార్యజయము కలుగును, భూ, గృహనిర్మాణాది సకల కార్యములు సిద్ధించును, వివాహది శూభకార్యములు సత్వరము నెరవేరును. తలచిన కార్యములన్నియు పూర్తి అగును. –

విద్యార్థులకు రెండవఛాన్స్ లాభము, ఉద్యోగులకు ఉత్తరార్ధము అనుకులముగా ఉన్నది. కోరిన చోటికి బదిలీలు జరుగును. రైతులకు రెండవ పంట అనుకూలము, వ్యాపారులకు శూభాశుభ మిశ్రమంగా నుండును. ఉత్తరార్ధమున లాభములను నార్జించగలరు, స్పెక్యూలేషన్ లాభించదు, నిరుద్యోగులకు ఉత్తరార్ధము కొంత పురోగతి లభించును. | బ్రహ్మచారులకు ద్వితియార్ధమున వివాహము జరుగును. NRI లకు అనుకూలముకాదు.