ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది..? | Lucky Colour According to Your Zodiac Sign in Telugu

0
28323

ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది..?

జన్మ రాశుల ప్రకారం ఒక్కో రాశివారికి ఒక్కో గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఆ గ్రహం ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. గ్రహ స్వభావాన్ని బట్టి ఒక్కో రాశిపై రంగుల ప్రభావం మారుతుంది. కొన్ని రాశులకు ఒకే గ్రహం అధిపతి అయినా గ్రహస్థానాన్ని బట్టి వేరు వేరు రాశుల వారికి వేరు వేరు రంగులు అదృష్ట కారకంగా చెప్పబడ్డాయి.  గ్రహానుకూలమైన రంగులను ధరించడం వలన అనుకూల పరిస్థితులు ఏర్పడి, అదృష్టం కలిసి వస్తుంది.

 మేష రాశి వారికి ఏ రంగు అదృష్టం ?

మేష రాశికి అధిపతి కుజుడు. ఎరుపు రంగు కుజునికి ప్రతీక. ఈ రాశివారికి ఎరుపు, రాగి రంగు, బంగారు వర్ణం వంటి పసుపు అదృష్టాన్ని కలిగిస్తాయి.

 వృషభ రాశి వారికి ఏ రంగు అదృష్టం ?

వృషభ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రునికి  తెలుపు రంగు ప్రతీక. ఈ రాశివారికి  తెలుపు, నీలం, గులాబీ రంగు,ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

మిథున రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

మిథున రాశికి అధిపతికి బుధ గ్రహం. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రతీక. మిథున రాశివారికి ఆకుపచ్చ, పసుపు, వంగపండు రంగు, నీలం, గులాబీ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

కర్కాటక రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రునికి ప్రతీక తెలుపు రంగు. ఈ రాశి వారికి తెలుపు, ఆకుపచ్చ, లేత గోధుమ రంగు,ఎరుపు, పసుపు రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

సింహ రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

సింహరాశికి సూర్యుడు అధిపతి. ఎరుపు, నారింజ రంగులు సూర్యునికి ప్రతీకలు. ఈ రాశివారికి ఎరుపు, నారింజ రంగు, ఆకుపచ్చ అదృష్టాన్ని కలిగిస్తాయి.

కన్యా రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

కన్యా రాశికి బుధుడు అధిపతి. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రతీక. ఆకుపచ్చ, పసుపు,తెలుపు, బూడిద రంగులు కన్యారాశివారికి అదృష్టాన్ని కలిగిస్తాయి.

తులారాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

తులారాశి అధిపతి శుక్రుడు. ఎరుపు రంగు శుక్రునికి ప్రతీక. ఈ రాశివారికి ఎరుపు, నీలం, నారింజ, తెలుపు రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

వృశ్చిక రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

వృశ్చికరాశికి అధిపతి కుజుడు. ఎరుపు రంగు కుజునికి ప్రతీక. ఈ రాశివారికి పసుపు, ఎరుపు, గోధుమ, నారింజరంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

ధనూరాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

ధనూరాశికి అధిపతి గురువు. పసుపు రంగు గురు గ్రహానికి ప్రతీక. ఈ రాశివారికి పసుపు, నెమలి కంఠంరంగు, తెలుపు, తెలుపు, లేత గోధుమ రంగు అదృష్టాన్ని కలిగిస్తాయి.

మకరరాశి వారికి ఏ రంగు అదృష్టం ?

మకర రాశికి అధిపతి శనైశ్చరుడు. నలుపురంగు శనైశ్చరునికి ప్రతీక. ఈ రాశివారికి ముదురు నీలం, నలుపు, తెలుపు రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి.

కుంభరాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

కుంభ రాశికి అధిపతి శనైశ్చరుడు. నలుపురంగు శనైశ్చరునికి ప్రతీక. ఈ రాశివారికి ముదురు నీలం, గోధుమరంగు, తెలుపు, పసుపు అదృష్టాన్ని కలిగిస్తాయి.

మీన రాశి వారికి ఏ రంగు అదృష్టం ? 

మీన రాశికి అధిపతి గురువు. పసుపు రంగు గురువుకు ప్రతీక. మీన రాశివారికి ఆకుపచ్చ, నీలం, ఎరుపు, పసుపు,గులాబీరంగు, ముదురు గోధుమ రంగు, తెలుపు అదృష్టాన్ని కలిగిస్తాయి.

ఏ రాశి వారికి ఏ దిక్కున ఉన్న ద్వారం మంచిది ? | Direction of main door as per Individual Zodiac Sign in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here