జులై 14 – వారాహీదేవి యొక్క నవరాత్రులు ప్రారంభం

0
876

యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీశక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకునిజీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీ దేవి.

ఈ శక్తికి సంబంధించిన మంత్రాలకు గురూపదేశం వంటివి ఉండాలి కానీ తల్లిగా కొలుచుకునేటపుడు ఆమెయొక్క స్తోత్రాదులు, “శ్రీ వారాహీ దేవ్యై నమః” మొదలైన నామములతో ఈ తొమ్మిది రోజులు పూజించడానికి ఇతర దేవతాపూజలకు పాటించే సాధారాణ నియమాలు సరిపోతాయి.

ఇచ్ఛ జ్ఞాన క్రియా శక్తులలో, క్రియాశక్తికి ప్రతీక శ్రీ వారాహీదేవి.

ఇచ్ఛా జ్ఞానశక్తులు క్రియాశక్తిలో కలిసిపోయినట్లు, శ్యామాలా లలితాదేవి కలగలసిన రూపం శ్రీ వారాహీదేవి. కిరాత వారాహి, భైరవి, స్వప్న వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో, నామాలతో అనుగ్రహించే తల్లి. ఈ తొమ్మిది రోజులూ వారాహీదేవియొక్క ప్రీతికై శ్రీ లలితా సహస్ర నామ, లలితాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాదులు చేసి దేవియొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here