ఈరోజు – శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు (అలంకరణ) | Annapurna Devi Alankaram in Telugu

0
11882
ఈరోజు - శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు (అలంకరణ)
Annapurna Devi Alankaram in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

2. ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారి అలంకరణ చేసి గోధుమ రంగు చీరను, తెల్లని పుష్పాలతో కూడిన మాలను సమర్పించి, అప్పాలు, నేతి అన్నం ను నైవేధ్యంగా నివేదన చేసి పై మంత్రములను పఠించడము ద్వారా రస పాత్రను ధరించి అది బిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం లభించి జాతకములో ఉన్న క్షీణ చంద్రుడి దోషము పోయి మనో క్లేశములన్నీ తొలగిపోతాయి.

గొప్ప మేధోశక్తి, సమయస్పూర్తి, జ్ఞానము లభిస్తుంది.
సంతాన సమస్యలతో భాడపడువారికి సంతానము కల్గుతుంది.
తలపెట్టిన పనుల యందు చికాకులు తొలగుతాయి.
ఐశ్వర్యాభివృద్ది కల్గుతుంది.
వృత్తి యందు స్తాన చలనం కోసము ప్రయత్నించే వారికి వారి వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
దైనందిన జీవితములో కలిగే అనవసర ధన వ్యయములనుండి ఉపశమనం లభిస్తుంది.
జాతకములో ఉన్నటువంటి సర్ప దోష తీవ్రత తగ్గుతుంది.
జీవితములో కనీస అవసరాలకు లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.
ముఖ్యంగా ఈ అమ్మవారిని సేవించడము ద్వారా ప్రయాణాలకు ,ఆహార పధార్ధాలకు, వెండి, తృణ ధాన్యాలకు సంభందించిన వృత్తులలో ఉన్న వారికి మరియు సంతాన కాంక్ష ఉన్న వారికి బాగా యోగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here