ఉగాది నాడు దేవునికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి? Ugadi Festival

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాధంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది. కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకంలాంటి నీరాహారం తినడం అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పులో వాడే పెసరపప్పు చలవచేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది.