మీకు ప్లాస్టిక్ సర్జరీ పితామహుని గురంచి తెలుసా ? | Father of Plastic Surgery in Telugu

0
9185
susruthatw3
మీకు ప్లాస్టిక్ సర్జరీ పితామహుని గురంచి తెలుసా ? | Father of Plastic Surgery in Telugu
Next

2. సుశ్రుతుని శస్త్ర చికిత్స

ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.


ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
“ఒక రాత్రి ఒక ప్రమాదం లో దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు.”

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన “ప్లాస్టిక్ సర్జరీ”.వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం “సుశ్రుతసంహిత”.ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here